04/11/2026, Wednesday · 09:42:04 AM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

పరిషత్ ఎన్నికల వేళ టీడీపీలోకి చేరికల జోరు.

D BHASKAR 01/11/2026 7:45 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 9

పరిషత్ ఎన్నికల వేళ టీడీపీలోకి చేరికల జోరు.
Want this news as a newspaper clip?Print News Clip
  • వెంకటేశ్వర నగర్ నుంచి 20 కుటుంబాలు టీడీపీలో చేరిక.
  • పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మస్తాన్ బాబు.

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు: పరిషత్ ఎన్నికల వేళ పొదలకూరు మండలంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. పొదలకూరు బిట్‌-4 పరిధిలోని వెంకటేశ్వర నగర్ (తోకంచి) గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పొదలకూరు టీడీపీ కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి మండల పార్టీ అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు పసుపు కండువాలు కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. పట్టణ టిడిపి అధ్యక్షుడు బొద్దులూరి మల్లికార్జున నాయుడు సమక్షంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ కరియావుల శ్రీనివాసులు నాయుడు, కరియావుల నారప నాయుడు, దేవినేని సురేష్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మస్తాన్ బాబు మాట్లాడుతూ.. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో పొదలకూరు మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరడం శుభపరిణామమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు మళ్లీ ఊపిరి పోస్తూ గ్రామాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సోమిరెడ్డి నాయకత్వంలో సర్వేపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో ప్రజలు టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. పొదలకూరు పంచాయతీలోని నాలుగు ఎంపీటీసీ సెగ్మెంట్లలోనూ టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ లో చేరిన వారిలో పంతగిరి అఖిల్, పంతగిరి శ్రీనయ్య, తలపాల గోపాలయ్య, యాకసిరి అంకయ్య, పంతగిరి అనిల్, మణికాల హరిప్రసాద్, నిమ్మల సుబ్బయ్య, నిమ్మల కిష్టయ్య, కలగండల సునీల్, పువ్వడి వినుకొండయ్య, యాకసిరి సుధాకర్, కొమ్మల పెంచలయ్య, కదిరి కిష్టయ్య, కత్తి శ్రీనయ్య, యాకసిరి వేణు, పంతగిరి అంకయ్య, పంతగిరి చిన్న అంకయ్య, పంతగిరి అశోక్, పంతగిరి వెంకటరమణ, త్రివిడి దినేష్ తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి :: పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు...

పరిషత్ ఎన్నికల వేళ టీడీపీలోకి చేరికల జోరు.

Parishad electionsIncreaseinductionsTDP

About the author

D

D BHASKAR

Reporter

Podalakur, Nellore

30 Posts

Latest News

పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు... వెంకటగిరి ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై ఖాదర్ బాషా వైసీపీ యువ నాయకుడు పడవల. శ్రీను, టీడీపీలో చేరిక... బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు అక్రమ అరెస్టులు, నోటీసులకు భయపడేది లేదు మా బిడ్డల సాక్షిగా రుస్తుం మైన్స్‌లో ఎలాంటి లబ్ధి పొందలేదు... వాకాటి శివారెడ్డి రాజకీయంగా ఎదుర్కోవాలి నోటీసులకు భయపడేది లేదు...ఉపసర్పంచ్ వాకాటి ఆదాల సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి బిరదవోలులో సుమలత ప్రచార జోరు..