04/11/2026, Wednesday · 09:42:06 AM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

D BHASKAR 01/11/2026 12:10 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 8

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు
Want this news as a newspaper clip?Print News Clip

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు:ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పొదలకూరు స్థానిక బస్టాండ్ సెంటర్‌లోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య నాయకులు, పెద్దలు, పొట్టి శ్రీరాములు అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన మహోన్నత త్యాగాన్ని, ఆయన నిరాహార దీక్షను, ప్రజల పట్ల ఆయనకున్న అంకితభావాన్ని స్మరించుకున్నారు.ఆయన త్యాగం, పట్టుదల, పోరాట స్ఫూర్తి నేటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు, త్యాగం ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూ, ఆయన పేరు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు, పెద్దలు, పొట్టి శ్రీరాములు అభిమానులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు...

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

Formation DayTributesMamarajeeviPottiSriramuluoccasionAndhraState

About the author

D

D BHASKAR

Reporter

Podalakur, Nellore

30 Posts

Latest News