04/11/2026, Wednesday · 09:42:02 AM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

హర్మూజ్‌ జలసంధిలో నౌకపై దాడి.. సముద్రంలో మునిగిన సింగపూర్‌ షిప్‌

JANAPATI VENKATA RAMESH BABU 15/10/2026 2:17 PM అంతర్జాతీయం 23

హర్మూజ్‌ జలసంధిలో నౌకపై దాడి.. సముద్రంలో మునిగిన సింగపూర్‌ షిప్‌
Want this news as a newspaper clip?Print News Clip
  • రెండు సింగపూర్‌ రిజిస్ట్రేషన్‌ నౌకలపై దాడులు జరిగినట్లు సమాచారం
  • జీఎఫ్ఎస్‌ ప్రైడ్‌ నౌక దగ్ధమై సముద్రంలో మునక
  • రెండు నౌకల్లోని 43 మంది సిబ్బంది సురక్షితం
  • నౌక మైన్‌ను ఢీకొని మునిగిపోయిందన్న ఇరాన్‌ నేవీ

హర్మూజ్‌ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న సింగపూర్‌ రిజిస్ట్రేషన్‌ కలిగిన రెండు కంటైనర్‌ నౌకలపై దాడులు జరిగినట్లు సింగపూర్‌ మారిటైమ్‌ అండ్‌ పోర్ట్‌ అథారిటీ వెల్లడించింది. ఈ ఘటనలో జీఎఫ్ఎస్‌ ప్రైడ్‌ అనే నౌకలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమై సముద్రంలో మునిగిపోయింది. అయితే, నౌకలోని 21 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు.

మరో నౌక జీఎఫ్ఎస్‌ గిసెల్‌ స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ సురక్షిత ప్రాంతానికి చేరుకుందని, అందులోని 22 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. రెండు నౌకల్లోనూ సింగపూర్‌ పౌరులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నారు. సముద్ర మార్గంలో ప్రయాణించే ఇతర నౌకలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు, ఈ ఘటనపై ఇరాన్‌ భిన్నమైన వాదనను వినిపించింది. తమ జలాల్లోకి అనధికారికంగా ప్రవేశించిన నౌక నేవల్‌ మైన్‌ను ఢీకొని పేలిపోయిందని ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ నేవీ పేర్కొంది. నౌకలో 2,500కు పైగా కంటైనర్లు ఉన్నాయని, సముద్రంలో తేలియాడుతున్న కంటైనర్లతో ఇతర నౌకలకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. హర్మూజ్‌ జలసంధిని తమ నౌకాదళం నిరంతరం పర్యవేక్షిస్తోందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నేవీ కమాండర్‌ అలీ అజ్మాయీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు...

SingaporeshipsinksStraitHormuz

About the author

JANAPATI VENKATA RAMESH BABU

JANAPATI VENKATA RAMESH BABU

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

46 Posts

Latest News

పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు... వెంకటగిరి ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై ఖాదర్ బాషా వైసీపీ యువ నాయకుడు పడవల. శ్రీను, టీడీపీలో చేరిక... పరిషత్ ఎన్నికల వేళ టీడీపీలోకి చేరికల జోరు. బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు అక్రమ అరెస్టులు, నోటీసులకు భయపడేది లేదు మా బిడ్డల సాక్షిగా రుస్తుం మైన్స్‌లో ఎలాంటి లబ్ధి పొందలేదు... వాకాటి శివారెడ్డి రాజకీయంగా ఎదుర్కోవాలి నోటీసులకు భయపడేది లేదు...ఉపసర్పంచ్ వాకాటి ఆదాల సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి