04/11/2026, Wednesday · 09:42:03 AM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

స్థానిక ఎన్నికల వాయిదా.. ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తామన్న అధికార కూటమి

JANAPATI VENKATA RAMESH BABU 22/10/2026 1:39 PM రాష్ట్ర వార్తలు 16

స్థానిక ఎన్నికల వాయిదా.. ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తామన్న అధికార కూటమి
Want this news as a newspaper clip?Print News Clip
  • ఈసీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టీకరణ
  • వైసీపీ కుట్రల వల్లే ఎన్నికలు ఆగిపోయాయని ఆరోపణ
  • ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ 59 పిటిషన్లు వేసిందన్న కూటమి
  • పారదర్శకంగా ఎన్నికలు జరగాలన్నదే తమ లక్ష్యమని వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అధికార కూటమి పార్టీలు ప్రకటించాయి. ఈసీ ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తామని స్పష్టం చేశాయి.

ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్లతో బుధవారం ఓ సంయుక్త ప్రకటన విడుదలైంది. కుట్రల ద్వారా ఎన్నికలను అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని ఈ ప్రకటనలో కూటమి పార్టీలు తీవ్రంగా ఆరోపించాయి. రాష్ట్రానికి కేంద్ర నిధులు సకాలంలో అందాలన్నా, అభివృద్ధి పనులు ముందుకు సాగాలన్నా ఎన్నికలు గడువులోగా పూర్తి చేయాలని తాము భావించినట్లు తెలిపాయి.

ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీకి ఏమాత్రం బాధ్యత లేదని, మొదటి నుంచీ స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకే ప్రయత్నిస్తోందని విమర్శించాయి. ఎన్నికలను నిలిపివేయడం కోసం వైసీపీ ఏకంగా 59 పిటిషన్లను కోర్టులలో దాఖలు చేసిందని, ఆ అడ్డంకులు తొలగి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే సమయంలో హింసను ప్రేరేపించిందని ఆరోపించాయి.

ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, నిజాయతీగా జరగాలన్నదే తమ లక్ష్యమని, ఈ ప్రక్రియకు పూర్తి మద్దతు ఇస్తామని కూటమి పునరుద్ఘాటించింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగి, సమర్థులైన నాయకులు ఎన్నికై, కూటమి ప్రభుత్వ ఫలాలు ప్రతి ఇంటికీ అందాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.

ఇదీ చదవండి :: పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు...

gauravistamanna adhikarasthanikaennikalavayidaisinirnayanni

About the author

JANAPATI VENKATA RAMESH BABU

JANAPATI VENKATA RAMESH BABU

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

46 Posts

Latest News

పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు... వెంకటగిరి ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై ఖాదర్ బాషా వైసీపీ యువ నాయకుడు పడవల. శ్రీను, టీడీపీలో చేరిక... పరిషత్ ఎన్నికల వేళ టీడీపీలోకి చేరికల జోరు. బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు అక్రమ అరెస్టులు, నోటీసులకు భయపడేది లేదు మా బిడ్డల సాక్షిగా రుస్తుం మైన్స్‌లో ఎలాంటి లబ్ధి పొందలేదు... వాకాటి శివారెడ్డి రాజకీయంగా ఎదుర్కోవాలి నోటీసులకు భయపడేది లేదు...ఉపసర్పంచ్ వాకాటి ఆదాల సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి