04/11/2026, Wednesday · 09:42:04 AM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు

D BHASKAR 01/11/2026 6:29 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 7

బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు
Want this news as a newspaper clip?Print News Clip
  • సైకిల్ గుర్తుకు ఓటేసి అభివృద్ధికి బాటలు వేయండి.
  • జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డిని సైతం గెలిపించాలి.
  • ప్రజలతో మమేకమవుతూ ఓట్లు అభ్యర్థించిన టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి అన్నలూరు సుమలత.

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది (భాస్కర్ దేవరకొండ)

పొదలకూరు, నవంబర్ 1: పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పొదలకూరు మండలం బిరదవోలు ఎంపీటీసీ సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నలూరు సుమలత ఆదివారం సాయంత్రం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులతో కలిసి బిరదవోలు ఎస్సీ కాలనీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఓటర్ల మద్దతు కోరారు. ప్రచారానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ.. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆశీస్సులతో ప్రజాసేవే లక్ష్యంగా ఎంపీటీసీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని తెలిపారు. బిరదవోలు సెగ్మెంట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కోరారు. బిరదవోలు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించడంతోపాటు, పొదలకూరు జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డిని సైతం ఆదరించి విజయాన్ని అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతామని, ప్రజలు అందించే ప్రతి ఓటు అభివృద్ధికి పునాది కావాలని సుమలత పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు...

బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు
బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు

campaign horoTDPelectionBiradavolu

About the author

D

D BHASKAR

Reporter

Podalakur, Nellore

30 Posts

Latest News

పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు... వెంకటగిరి ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై ఖాదర్ బాషా వైసీపీ యువ నాయకుడు పడవల. శ్రీను, టీడీపీలో చేరిక... పరిషత్ ఎన్నికల వేళ టీడీపీలోకి చేరికల జోరు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు అక్రమ అరెస్టులు, నోటీసులకు భయపడేది లేదు మా బిడ్డల సాక్షిగా రుస్తుం మైన్స్‌లో ఎలాంటి లబ్ధి పొందలేదు... వాకాటి శివారెడ్డి రాజకీయంగా ఎదుర్కోవాలి నోటీసులకు భయపడేది లేదు...ఉపసర్పంచ్ వాకాటి ఆదాల సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి బిరదవోలులో సుమలత ప్రచార జోరు..