04/11/2026, Wednesday · 09:42:03 AM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

ఆదాల సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి

D BHASKAR 31/10/2026 7:35 PM ఆంధ్రప్రదేశ్ 7

ఆదాల సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి
Want this news as a newspaper clip?Print News Clip
  • తల్లి గెలుపు కోసం ఇంటింటా తనయుడు ఆదాల మురళి ప్రచారం
  • ️ మస్తాన్‌రెడ్డి నగర్, శివాలయం వీధిలో జోరుగా ఎన్నికల ప్రచారం
  • ️ హారతులతో ఘనస్వాగతం పలికిన మహిళలు
  • ️ అభివృద్ధిని చూసి సైకిల్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు: పొదలకూరు బిట్‌-1 టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిని ఆదాల సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కుమారుడు, టీడీపీ యువ నాయకుడు ఆదాల మురళి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పొదలకూరు పట్టణంలోని మస్తాన్‌రెడ్డి నగర్, శివాలయం వీధిలో బీజేపీ నాయకుడు బొడ్డు గురుస్వామితో కలిసి ఇంటింటా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల మహిళలు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆదాల మురళి మాట్లాడుతూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు. తన తల్లి ఆదాల సుగుణమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. మస్తాన్‌రెడ్డి నగర్, శివాలయం వీధితో పాటు బిట్‌-1 పరిధిలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఎమ్మెల్యే సోమిరెడ్డి సహకారంతో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.జెడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డిని సైతం భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆశీస్సులతో పోటీ చేస్తున్న మండలంలోని టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులందరికీ సైకిల్ గుర్తుపై ఓటేసి మద్దతు ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. స్థానిక సంస్థల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మరింత ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు.మస్తాన్‌రెడ్డి నగర్, శివాలయం వీధిలో నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు ఆదాల మురళి, బీజేపీ నాయకుడు బొడ్డు గురుస్వామితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు...

ఆదాల సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి

Adala SugunammaWinhugemajority

About the author

D

D BHASKAR

Reporter

Podalakur, Nellore

30 Posts

Latest News

పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు... వెంకటగిరి ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై ఖాదర్ బాషా వైసీపీ యువ నాయకుడు పడవల. శ్రీను, టీడీపీలో చేరిక... పరిషత్ ఎన్నికల వేళ టీడీపీలోకి చేరికల జోరు. బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు అక్రమ అరెస్టులు, నోటీసులకు భయపడేది లేదు మా బిడ్డల సాక్షిగా రుస్తుం మైన్స్‌లో ఎలాంటి లబ్ధి పొందలేదు... వాకాటి శివారెడ్డి రాజకీయంగా ఎదుర్కోవాలి నోటీసులకు భయపడేది లేదు...ఉపసర్పంచ్ వాకాటి బిరదవోలులో సుమలత ప్రచార జోరు..