04/11/2026, Wednesday · 09:42:01 AM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

స్థానిక సంస్థలకు రూ.40 వేల కోట్ల నిధులు

D BHASKAR 29/10/2026 11:01 AM ఆంధ్రప్రదేశ్ 14

స్థానిక సంస్థలకు రూ.40 వేల కోట్ల నిధులు
Want this news as a newspaper clip?Print News Clip
  • .ఎన్నికల అనంతరం కేంద్రం నుంచి విడుదల.. సోమిరెడ్డి వెల్లడి
  • .తాటిపర్తిలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం
  • .స్థానిక సంస్థల్లో ఏకపక్షంగా ఓట్లు వేయాలని పిలుపు.
  • .టీడీపీ అభ్యర్థులను గెలిపించండి.. గ్రామాల అభివృద్ధికి బాటలు వేయండి

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు, అక్టోబరు 29:

 స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.40 వేల కోట్ల నిధులు రానున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, స్థానిక సంస్థల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. పొదలకూరు మండలంలోని నల్లపాలెం, తాటిపర్తి గ్రామాల్లో పరిషత్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. తాటిపర్తిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

తాటిపర్తి పంచాయతీ పరిధిలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని సోమిరెడ్డి తెలిపారు. గ్రామంలో అభివృద్ధిని గుర్తించి ప్రజలు ఏకపక్షంగా టీడీపీకి మద్దతు పలకాలని కోరారు. ఎంపీటీసీ అభ్యర్థులు కసిరెడ్డి కృష్ణవేణి, పల్లవరపు కృష్ణ, జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్‌రెడ్డిని సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాటిపర్తిలో ప్రజా చైతన్యంతో తిరుగుబాటు రావాలని పిలుపునిచ్చారు.

*ప్రజల కోసమే నా జీవితం*🚲

తాను గెలిచినా, ఓడినా ప్రజల కోసమే జీవించానని సోమిరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధనం కోసమే బతుకుతున్నారని ఆరోపించారు. జడ్పీ చైర్మన్‌గా, రెండుసార్లు

ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాకాణి ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఏమైనా చేశాడంటే తాటిపర్తి పంచాయతీ పరిధిలోని వరదాపురం వద్ద రుస్తుం మైన్‌లో దోపిడీకి పాల్పడ్డారని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ ఆస్తులను దోచుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

*అభివృద్ధి, సంక్షేమమే టీడీపీ అజెండా*🚲

కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యమిస్తోందని సోమిరెడ్డి పేర్కొన్నారు. కేంద్రం నుంచి రానున్న నిధులను సద్వినియోగం చేసుకుంటే స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులకు మరింత అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం, సమర్థమైన స్థానిక నాయకత్వం అవసరమని చెప్పారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా గ్రామాల ప్రగతిని కొనసాగించవచ్చని, అభివృద్ధి పనులకు అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మస్తాన్‌బాబు, స్థానిక టీడీపీ నాయకులు బాలిరెడ్డి, హనుమారెడ్డి, కండే మస్తానయ్య, పార్లపల్లి రమేష్‌రెడ్డి, పార్లపల్లి మోహన్‌, సురేష్‌రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు...

స్థానిక సంస్థలకు రూ.40 వేల కోట్ల నిధులు

crore financinglocalbodies

About the author

D

D BHASKAR

Reporter

Podalakur, Nellore

30 Posts

Latest News

పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు... వెంకటగిరి ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై ఖాదర్ బాషా వైసీపీ యువ నాయకుడు పడవల. శ్రీను, టీడీపీలో చేరిక... పరిషత్ ఎన్నికల వేళ టీడీపీలోకి చేరికల జోరు. బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు అక్రమ అరెస్టులు, నోటీసులకు భయపడేది లేదు మా బిడ్డల సాక్షిగా రుస్తుం మైన్స్‌లో ఎలాంటి లబ్ధి పొందలేదు... వాకాటి శివారెడ్డి రాజకీయంగా ఎదుర్కోవాలి నోటీసులకు భయపడేది లేదు...ఉపసర్పంచ్ వాకాటి ఆదాల సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి