కాకాణి కుటుంబం దోపిడీలకు అంతులేదు ... స్థానిక సంస్థలు బలోపేతం కావాలి. సోమిరెడ్డి

- ప్రభుత్వ భూములనూ బినామీల పేరుతో కొల్లగొట్టారు
- రుస్తుం మైన్ లో అక్రమంగా దోపిడీకి పాల్పడ్డారు
- బాధితుల పక్షాన సత్యాగ్రహం చేస్తే నాపైకి రెండు బస్సుల్లో హిజ్రాలను పంపించారు
- మళ్లీ ఆ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు
- అయ్యగారిపాలెం, మహమ్మదాపురంలో సోమిరెడ్డి ఘాటు విమర్శలు
అమరావతి వెలుగు
పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ
పొదలకూరు: దశాబ్దాలుగా పొదలకూరు ప్రజల ఓట్లతో అధికారం అనుభవించిన కాకాణి కుటుంబం దోపిడీలకు పాల్పడిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇతరుల మైనింగ్ వ్యవహారాల్లో అక్రమంగా జోక్యం చేసుకుని దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను సైతం తన అల్లుడు, అనుచరులు, బినామీల పేర్లతో కాజేశారని మండిపడ్డారు.
పొదలకూరు మండలంలోని అయ్యగారిపాలెం, మహమ్మదాపురం గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సోమిరెడ్డి పాల్గొన్నారు. పొదలకూరు జెడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డితో పాటు మండలంలోని 19 మంది ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార సభల్లో ఆయన వైసీపీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మండలంలోని వరదాపురం రుస్తుం మైన్ లో కాకాణి దోపిడీని ప్రశ్నిస్తూ బాధితుని పక్షాన తాను సత్యాగ్రహం చేపడితే తనపైకి రెండు బస్సుల్లో హిజ్రాలను పంపించారని సోమిరెడ్డి ఆరోపించారు. జిల్లా చరిత్రలో ఇంతటి నీచమైన చర్యలకు పాల్పడిన వ్యక్తి మరొకరు లేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని రామదాసు కండ్రిక, కొమ్మలపూడి, వీరంపల్లి, మరుపూరు, సూరాయపాలెం, ఆల్తుర్తి గ్రామాల్లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను బినామీల పేర్లతో దోచుకున్నారని విమర్శించారు. అలాంటి పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల ఆస్తులకు భద్రత ఉండదని హెచ్చరించారు.
*స్థానిక సంస్థలు బలోపేతం కావాలి*
గ్రామాల అభివృద్ధి వేగవంతం కావాలంటే స్థానిక సంస్థలు బలోపేతం కావాలని సోమిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు అందాలంటే టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పొదలకూరు మండలంలో జెడ్పీటీసీతో పాటు 19 మంది ఎంపీటీసీ అభ్యర్థుల విజయానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, తోడేరు ఎంపీటీసీ అభ్యర్థి అట్ల శ్రీకాంత్, టీడీపీ నాయకులు కండే నరసయ్య, కట్ట రవీంద్ర యాదవ్, గంగయ్య, అడపాల సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు...












