04/11/2026, Wednesday · 09:42:05 AM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

ప్రజల ఆదరణే మా బలం.. అభివృద్ధే మా నినాదం

D BHASKAR 29/10/2026 2:00 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 16

ప్రజల ఆదరణే మా బలం.. అభివృద్ధే మా నినాదం
Want this news as a newspaper clip?Print News Clip
  • పొదలకూరులో బిట్‌–1, బిట్‌–2, బిట్‌–3 ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థి విస్తృత ప్రచారం
  • గడపగడపకూ వెళ్లి ప్రజలతో మమేకం
  • ● సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్ల అభ్యర్థన
  • ● కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంపై విశ్వాసం
  • ● ప్రజల ఆశీస్సులతో స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తాం

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు, అక్టోబర్ 29:

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పొదలకూరు మండలంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బిట్‌–1 ఎంపీటీసీ అభ్యర్థి గంగవరపు లక్ష్మి కళ్యాణి, బిట్‌–2 ఎంపీటీసీ అభ్యర్థి వాకాటి సంధ్య, బిట్‌–3 ఎంపీటీసీ అభ్యర్థి కోవూరు వెంకటేశ్వర్లుతో పాటు జడ్పీటీసీ అభ్యర్థి బచ్చల సురేష్‌ కుమార్‌రెడ్డి ప్రజల్లోకి వెళ్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గడపగడపకూ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రచారంలో ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ తమకు మరింత ఉత్సాహాన్నిస్తోందని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంక్షేమం.. అభివృద్ధే ప్రధాన అజెండా

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో అమలైన సంక్షేమ పథకాలు, పేద ప్రజలకు అందించిన ఆర్థిక సహాయం, విద్యా, వైద్య రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలను అభ్యర్థులు ప్రజలకు వివరిస్తున్నారు. అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందించడం, విద్యార్థులకు విద్యా సహాయం, రైతులకు అండగా నిలవడం, మహిళల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల మద్దతు కోరుతున్నారు.అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషి, ప్రజలతో కొనసాగిస్తున్న అనుబంధం తమకు బలమని అభ్యర్థులు పేర్కొంటున్నారు.

ప్రజలతో మమేకమవుతూ ముందుకు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అవసరాలు, సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తమ లక్ష్యమని హామీ ఇస్తున్నారు. ప్రజల ఆశీస్సులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ఎన్నికల్లో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన నాయకులే నిజమైన ప్రజాప్రతినిధులని పేర్కొంటూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తామని అభ్యర్థులు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించేందుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ఓటర్లను కోరారు. బిట్‌–1, బిట్‌–2, బిట్‌–3 ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుని పొదలకూరు మండలంలో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

ఇదీ చదవండి :: పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు...

ప్రజల ఆదరణే మా బలం.. అభివృద్ధే మా నినాదం

strength DevelopmentPeoplesupportmotto

About the author

D

D BHASKAR

Reporter

Podalakur, Nellore

30 Posts

Latest News

పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు... వెంకటగిరి ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై ఖాదర్ బాషా వైసీపీ యువ నాయకుడు పడవల. శ్రీను, టీడీపీలో చేరిక... పరిషత్ ఎన్నికల వేళ టీడీపీలోకి చేరికల జోరు. బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు అక్రమ అరెస్టులు, నోటీసులకు భయపడేది లేదు మా బిడ్డల సాక్షిగా రుస్తుం మైన్స్‌లో ఎలాంటి లబ్ధి పొందలేదు... వాకాటి శివారెడ్డి రాజకీయంగా ఎదుర్కోవాలి నోటీసులకు భయపడేది లేదు...ఉపసర్పంచ్ వాకాటి ఆదాల సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి