04/11/2026, Wednesday · 09:42:06 AM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

సుప్రీంకోర్టు ఆదేశాలు చదివావా ధర్మానా..? అసలు నీకు అర్థమయ్యాయా..?

JANAPATI VENKATA RAMESH BABU 22/10/2026 6:38 PM రాష్ట్ర వార్తలు 17

సుప్రీంకోర్టు ఆదేశాలు చదివావా ధర్మానా..? అసలు నీకు అర్థమయ్యాయా..?
Want this news as a newspaper clip?Print News Clip
  • సుప్రీంకోర్టు ఆదేశాలను వక్రీకరించి ప్రభుత్వానికి చెంపదెబ్బ అంటూ తప్పుడు ప్రచారం
  • 2021 స్థానిక ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదు
  • నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను అక్రమంగా తొలగించిన చరిత్ర మీది కాదా..?
  • ప్యాలెస్‌లో జగన్ రెడ్డి ఆదేశాలతోనే గొడ్డలి పార్టీ రౌడీమూకల అరాచకాలు
  • ప్రజాక్షేత్రంలో తేల్చుకునే వాళ్లమే తప్ప.. అక్రమంగా అడ్డుకునే వాళ్లం కాదు
  • గొడ్డలి పార్టీ గూండాగిరిని, ఫ్యాక్షన్ సంస్కృతిని ఉపేక్షించేది లేదు
  • వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజం

అమరావతి, అక్టోబర్ 22: సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా చదివి అర్థం చేసుకోవడం రాని గొడ్డలి పార్టీ నాయకుల నుంచి సరైన విశ్లేషణ ఆశించడం మాదే తప్పని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో తానే అత్యంత తెలివైనవాడినని తనకు తాను చెప్పుకునే ధర్మాన సుప్రీంకోర్టు ఆదేశాలు చదివావా? అవి నీకు అర్థమయ్యాయా? అని ప్రశ్నించారు. తుది జాబితా ప్రచురణను ఈ నెల 25 వరకు వాయిదా వేయాలని, నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారనే ఫిర్యాదులు అందితే సంబంధిత సాక్ష్యాధారాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. శాంతిభద్రతల సమస్య కారణంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని నిర్ధారణ అయితే ఆ పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే నామినేషన్ల గడువును పొడిగించాలని, ఆ పొడిగింపు కూడా నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి 48 గంటలు మాత్రమే ఉండాలని స్పష్టం చేసిందన్నారు. ఇంత స్పష్టంగా ఉన్న ఆదేశాలను వక్రీకరించి ప్రభుత్వానికి ‘చెంపదెబ్బ’ అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టే వైసీపీ అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులతో సమానంగా నామినేషన్లు దాఖలు చేయగలిగారని, మేము ప్రజాక్షేత్రంలో తేల్చుకునే వాళ్లమే తప్ప అక్రమంగా అడ్డుకునే వాళ్లం కాదని స్పష్టం చేశారు.

2021 స్థానిక ఎన్నికల ప్రక్రియలో మీ దౌర్జన్యాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అభ్యర్థులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, ఫిర్యాదు చేసినా, కోర్టును ఆశ్రయించినా చంపేస్తారనే భయం కల్పించి, 80 శాతం స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు చేసుకున్న చరిత్ర మీది అని ఆరోపించారు. అదే మీ రప్పా రప్పా రాజ్యాంగం అంటూ ఎద్దేవా చేశారు. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ని అక్రమంగా తొలగించిన తీరు, కోర్టు ద్వారా ఆయన తిరిగి నియమితులైన తర్వాత కూడా ఆయనపై చేసిన వ్యక్తిత్వ హననం ప్రజలు మరిచిపోలేదన్నారు. ఇలాంటి చరిత్ర ఉన్న మీ పార్టీ, మీ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు రాజ్యాంగ సంస్థలు, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల మీకున్న గౌరవమేమిటో మీ గత చరిత్రే చెబుతోందని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ రెడ్డి ఇచ్చే ఆదేశాల మేరకే గొడ్డలి పార్టీ రౌడీమూకలు క్షేత్రస్థాయిలో బరితెగించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటే తమ ఉనికికే ప్రమాదమని అల్లర్లు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో గులకరాయి, కోడికత్తి నాటకాలతో సానుభూతి పొందేందుకు ప్రయత్నించినట్లే, ఇప్పుడు తామే అల్లర్లు సృష్టించి శాంతిభద్రతలు లేవంటూ సానుభూతి పొందాలనుకుంటున్నారని విమర్శించారు. కానీ ప్రజలు మీ నైజాన్ని ఇప్పటికే తెలుసుకున్నారని, ఇక మీ ఆటలు చెల్లవని హెచ్చరించారు. పుంగనూరులో ఎంపీ కాన్వాయ్‌లో మారణాయుధాలు, మద్యం బాటిళ్లు పెట్టుకుని ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూసింది మీ గొడ్డలి పార్టీ కాదా అని సూటిగా ప్రశ్నించారు.

ప్రజాక్షేత్రంలో ఘోర పరాజయం తప్పదని ముందే తెలిసిపోయి, కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకక, ఇప్పుడు పోలీసులు అడ్డుకుంటున్నారని, ఎన్ఓసీలు ఇవ్వడం లేదని కుంటిసాకులు చెబుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. మాది ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం కాబట్టే రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా తన విధులు నిర్వర్తించగలుగుతోందన్నారు. ఎన్ఓసీల అవసరం లేదని స్పష్టం చేయడంతోపాటు, చిన్న ఫిర్యాదు అందినా పూర్తిస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చేంత స్వేచ్ఛగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని పేర్కొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు గొడ్డలి పార్టీ గూండాగిరికి, ఫ్యాక్షన్ సంస్కృతికి రాజకీయంగా సమాధి కట్టడం ఖాయమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్రాన్ని అశాంతిపాలు చేయాలని చూసే గొడ్డలి పార్టీ ముఠా నాయకుల్లో ఏ ఒక్కరినీ కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

ఇదీ చదవండి :: పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు...

Supreme Courtrightreadordersunderstand

About the author

JANAPATI VENKATA RAMESH BABU

JANAPATI VENKATA RAMESH BABU

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

46 Posts

Latest News

పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు... వెంకటగిరి ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై ఖాదర్ బాషా వైసీపీ యువ నాయకుడు పడవల. శ్రీను, టీడీపీలో చేరిక... పరిషత్ ఎన్నికల వేళ టీడీపీలోకి చేరికల జోరు. బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు అక్రమ అరెస్టులు, నోటీసులకు భయపడేది లేదు మా బిడ్డల సాక్షిగా రుస్తుం మైన్స్‌లో ఎలాంటి లబ్ధి పొందలేదు... వాకాటి శివారెడ్డి రాజకీయంగా ఎదుర్కోవాలి నోటీసులకు భయపడేది లేదు...ఉపసర్పంచ్ వాకాటి ఆదాల సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి