04/11/2026, Wednesday · 09:42:00 AM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

పట్టణ అభివృద్ధికి మద్దతు ఇవ్వండి!

chalapathi 29/10/2026 4:19 PM శ్రీ సత్యసాయి 14

పట్టణ అభివృద్ధికి మద్దతు ఇవ్వండి!
Want this news as a newspaper clip?Print News Clip
  • 34, 35, 31వ వార్డుల్లో ఎమ్మెల్యే కందికుంట ప్రచారం

కదిరి: పట్టణ అభివృద్ధికి అండగా నిలవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. కదిరి మున్సిపాలిటీలోని 34, 35, 31వ వార్డుల్లో గురువారం కూటమి అభ్యర్థుల తరఫున ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజలు నాయకులకు స్వాగతం పలికారు. జై టీడీపీ.. జై కందికుంట నినాదాలతో వార్డులు మార్మోగాయి.

ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పట్టణంలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

నవంబరు 1న జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో చైర్‌పర్సన్‌ అభ్యర్థి షేక్‌ అర్షియా భానుతో పాటు మూడు వార్డుల అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు చెంచయ్య నాయుడు,  మొగల్‌ ఫారూఖ్‌,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు...

urban developmentSupport

About the author

C

chalapathi

Staff Reporter

5 Posts

Latest News

పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు... వెంకటగిరి ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై ఖాదర్ బాషా వైసీపీ యువ నాయకుడు పడవల. శ్రీను, టీడీపీలో చేరిక... పరిషత్ ఎన్నికల వేళ టీడీపీలోకి చేరికల జోరు. బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు అక్రమ అరెస్టులు, నోటీసులకు భయపడేది లేదు మా బిడ్డల సాక్షిగా రుస్తుం మైన్స్‌లో ఎలాంటి లబ్ధి పొందలేదు... వాకాటి శివారెడ్డి రాజకీయంగా ఎదుర్కోవాలి నోటీసులకు భయపడేది లేదు...ఉపసర్పంచ్ వాకాటి ఆదాల సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి