గెలుపోటములకు అతీతంగా.. ఆత్మీయ సమ్మేళనం!

- పోటీ చేసిన వారందరికీ ఎమ్మెల్యే అభినందనలు
- పట్టణ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపు
కదిరి, నవంబరు 17 (అమరావతి వెలుగు): మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములకు అతీతంగా అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. పట్టణంలోని మదనపల్లి రోడ్డులో ఉన్న పీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లుగా ఎన్నికైన కూటమి అభ్యర్థులతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గెలుపొందిన చైర్‌పర్సన్, కౌన్సిలర్లను ఎమ్మెల్యే అభినందించారు. ఎన్నికల్లో విజయం సాధించినా.. ఓటమి ఎదురైనా పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి ప్రశంసించారు. నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో ముందుకు సాగాలని, కదిరి పట్టణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు.సమావేశానికి హాజరైన చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, పోటీ చేసిన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా విందు భోజనం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి భైరవ ప్రసాద్, టీడీపీ నాయకులు పవన్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త మొగల్ ఫారూఖ్, పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్, పట్టణ ప్రధాన కార్యదర్శి జి.చలపతి, సీనియర్ నాయకుడు మోపురి చంద్రశేఖర్, స్వచ్ఛాంధ్ర కమిషన్ డైరెక్టర్ పర్వీన్ భాను, తనకల్లు మండల నాయకుడు శంకర్‌నాయుడు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: విధేయతకే సర్పంచి పీఠం..!












