అధికార పార్టీ కూటమి బలపరచిన కౌతాళం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి గాండ్ల శ్రీయ గారు.

కౌతాళం అమరావతి వెలుగు న్యూస్ నవంబర్14
• మండల కేంద్రమైన కౌతాళంలో తదితర వార్డులో పర్యటించి స్థానిక ప్రజలను కలిసి వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి గాండ్ల శ్రీయ గారు.
ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ రోడ్ల అభివృద్ధి మరియు మంచినీటి సరఫరా ఇంటి పట్టాల సమస్యలతో పాటు పలు సమస్యలను ప్రజలు అధికార కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి గాండ్ల శ్రీయ గారి దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు తెలిపిన సమస్యలపై అధికార కూటమి బలపరిచిన కౌతాళం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి గాండ్ల శ్రీయ గారు ప్రజలు తెలిపిన సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కౌతాళం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చౌదరి బసవరాజు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజుగారు కాశీ విశ్వనాథ్ గారు రాజాబాబు జనసేన నాయకులు రాంబాబు రామాంజనేయులు స్వామి దాస్ పుగ్గి ఈరన్న పుగ్గి రంగస్వామి సిద్దు మల్లికార్జున లక్ష్మయ్య చంద్రప్ప చిరంజీవి మంజునాథ భీమయ్య రఘురాం పించారి బాబు తదితరులు పాల్గొన్నారు
ఇదీ చదవండి :: విధేయతకే సర్పంచి పీఠం..!











