17/11/2026, Tuesday · 09:38:17 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

కర్నూలు జిల్లాలో.. జిల్లా జడ్పీ చైర్మన్ పీఠాన్ని ఎవరికి..

THAYANNA 13/11/2026 5:57 PM కర్నూలు 24

కర్నూలు జిల్లాలో..  జిల్లా జడ్పీ చైర్మన్ పీఠాన్ని ఎవరికి..
Want this news as a newspaper clip?Print News Clip

కర్నూలు: కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎంపిక వ్యవహారం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. జడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు పలువురు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో కురువ శంకరమ్మ పేరు మరోసారి తెరపైకి వచ్చింది.

కురువ శంకరమ్మకు కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి అవకాశం కల్పించాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నేరుగా ఫోన్‌లో మాట్లాడినట్లు రాజకీయ వర్గాల్లో సమాచారం ప్రచారంలో ఉంది. ఈ పరిణామం ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

జడ్పీ పీఠం కోసం ఐదుగురి మధ్య పోటీ!

కర్నూలు జిల్లాలో మొత్తం 26 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి 20 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో జడ్పీ చైర్మన్ పదవిపై కూటమికి ఆధిక్యం ఏర్పడింది. అయితే ఈ పదవిని ఎవరికి కేటాయించాలనే అంశంపై పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రధానంగా కౌతాళం జడ్పీటీసీ చూడి ఉలిగయ్య, దేవనకొండ జడ్పీటీసీ షేక్ సాధికా, తుగ్గలి జడ్పీటీసీ మిద్దె గీతాకుమారి, ఆదోని జడ్పీటీసీ కురువ శంకరమ్మ, హోళగుంద జడ్పీటీసీ గోవింద్ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.

కురువ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్!

కర్నూలు జిల్లాలో కురువ సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని ఆ వర్గానికి చెందిన నాయకులు కోరుతున్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కురువ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు తగిన గుర్తింపు ఇవ్వాలని, జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కురువలకు కేటాయించాలని కురువ సంఘం నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదోని జడ్పీటీసీ కురువ శంకరమ్మకు అవకాశం కల్పించాలనే అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. సిద్ధరామయ్య ఫోన్ చేసినట్లు వస్తున్న సమాచారం ఈ వ్యవహారంపై మరింత ఆసక్తిని పెంచుతోంది.      చంద్రబాబు నిర్ణయంపైనే అందరి చూపు!

జడ్పీ చైర్మన్ ఎంపికలో సామాజిక సమీకరణాలు, రాజకీయ అనుభవం, పార్టీకి చేసిన సేవలు, మహిళా నాయకత్వం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. మరోవైపు రాష్ట్రస్థాయి నాయకుల పరిచయాలు, సిఫార్సులు కూడా చర్చకు వస్తున్నాయి.

ఈ నెల 20న కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ వెలువడింది. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

కురువ శంకరమ్మకు అవకాశం దక్కుతుందా? సిద్ధరామయ్య చేసినట్లు ప్రచారంలో ఉన్న ఫోన్ విజ్ఞప్తికి చంద్రబాబు ఎలా స్పందిస్తారు? కురువ సామాజిక వర్గానికి జడ్పీ పీఠం దక్కుతుందా? అనే ప్రశ్నలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అయితే సిద్ధరామయ్య–చంద్రబాబు ఫోన్ సంభాషణపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు. తుది నిర్ణయం టీడీపీ అధిష్ఠానం ప్రకటించాల్సి ఉంది.

కర్నూలు జిల్లా జడ్పీ పీఠం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే!

కర్నూలు జిల్లా తాజా రాజకీయ పరిణామాలు.

ఇదీ చదవండి :: విధేయతకే సర్పంచి పీఠం..!

కర్నూలు జిల్లాలో..  జిల్లా జడ్పీ చైర్మన్ పీఠాన్ని ఎవరికి..

Parishad ChairmanKurnooldistrictZillaseat

About the author

Latest News