ఘనంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు..

అమరావతి వెలుగు
పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ
పొదలకూరు బచ్‌పన్ ప్లే స్కూల్ ప్రాంగణంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి దేశ భావి భారత పౌరులని, పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడమే బచ్‌పన్ పాఠశాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు చాచా నెహ్రూ వేషధారణలో, విభిన్న సాంప్రదాయ దుస్తుల్లో మెరిసి అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారుల నృత్యాలు, పాటలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు మరియు ఆటపాటలతో పాఠశాల ప్రాంగణం కోలాహలంగా మారింది. ఉపాధ్యాయులు కూడా పిల్లల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి వారిని ఉత్సాహపరిచారు.
అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ లెక్కల. సురేష్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: విధేయతకే సర్పంచి పీఠం..!













