17/11/2026, Tuesday · 09:30:08 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

వార్డు మెంబెర్ గా పోటీ చేస్తున్నా ఆశీర్వదించండి...బ్రహ్మదేవి చంద్రశేఖర్.

D BHASKAR 17/11/2026 8:46 AM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 5

వార్డు మెంబెర్ గా పోటీ చేస్తున్నా ఆశీర్వదించండి...బ్రహ్మదేవి చంద్రశేఖర్.
Want this news as a newspaper clip?Print News Clip

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు పట్టణంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి. చంద్రమోహన్ రెడ్డి, సోమిరెడ్డి. రాజగోపాల్ రెడ్డి, సోమిరెడ్డి. శృతి రెడ్డి, ఆశీస్సులతో 6వ వార్డు మెంబర్ స్థానానికి కూటమి బలపరిచిన అభ్యర్థిగా బ్రహ్మదేవి. చంద్రశేఖర్, పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన పొదలకూరు తెలుగుయువత ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన వార్డు ఎన్నికల్లో కూడా మెంబర్ అభ్యర్థిగా పోటీ చేశారు. రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తెలుగుయువత విభాగంలో తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో 6వ వార్డు నుంచి మరోసారి తన అభ్యర్థిత్వంతో ప్రజల ముందుకు వస్తున్నారు. వార్డులో తాగునీటి సమస్య, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, రహదారులు వంటి స్థానిక సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. 6వ వార్డు ఎన్నికల నేపథ్యంలో బ్రహ్మదేవి చంద్రశేఖర్ అభ్యర్థిత్వం స్థానికంగా ఆసక్తిని కలిగిస్తోంది. రాబోయే ఎన్నికల్లో వార్డు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇదీ చదవండి :: విధేయతకే సర్పంచి పీఠం..!

Brahmadevi ChandrashekharPleaseblesscontestingwardmember

About the author

D

D BHASKAR

Reporter

Podalakur, Nellore

46 Posts

Latest News