17/11/2026, Tuesday · 09:38:18 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

పొదలకూరులో అయ్యప్ప నామస్మరణతో మార్మోగనున్న ఆధ్యాత్మిక సందడి.

D BHASKAR 09/11/2026 3:19 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 23

పొదలకూరులో అయ్యప్ప నామస్మరణతో మార్మోగనున్న ఆధ్యాత్మిక సందడి.
Want this news as a newspaper clip?Print News Clip
  • రేపు అయ్యప్ప స్వామికి అంబళం పూజ.
  • 2 వేల మంది అయ్యప్ప స్వాముల రాకకు ఏర్పాట్లు.
  • బుధవారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ.
  • రాత్రికి అయ్యప్ప స్వామివారి గ్రామోత్సవం.

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు : శరణుఘోషతో పొదలకూరు పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. అయ్యప్ప స్వామి నామస్మరణతో పట్టణం మార్మోగనుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పొదలకూరులోని శ్రీ విఘ్నేశ్వర మరియు కామాక్షితాయి రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం 49వ అంబళం పూజ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

శబరిమల అయ్యప్ప సేవా సమాజం, గ్రామ పెద్దలు మరియు అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో గురుస్వామి అల్లూరు రమణయ్య స్వామి పర్యవేక్షణలో ఈ మహోత్సవం జరగనుంది. వేడుకలకు సంబంధించిన పోస్టర్లను అయ్యప్ప స్వాములు ఆవిష్కరించారు.

భక్తిభావంతో అంబళం పూజలు..

ఈ సందర్భంగా గురుస్వామి చొప్పా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది కార్తీక మాసంలో 10వ తేదీన సంప్రదాయబద్ధంగా అంబళం పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రేపు మంగళవారం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అంబళం పూజలు, తీర్థప్రసాదాల వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకలకు పొదలకూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 2 వేల మంది అయ్యప్ప స్వాములు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

బుధవారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ... రాత్రికి అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవం..

బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు అయ్యప్ప స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరగనుంది. మేళతాళాలు, భక్తుల ఆటపాటలు, బాణసంచా సంబరాలు, రంగురంగుల విద్యుత్ దీపాలంకరణల నడుమ స్వామివారి గ్రామోత్సవాన్ని కనులపండువగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.

డిసెంబర్ 8 వరకు నిత్య అన్నప్రసాద వితరణ

అయ్యప్ప మాలధారణ చేసిన భక్తుల సౌకర్యార్థం మంగళవారం నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.45 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేస్తున్నట్లు గురుస్వామి చొప్ప వెంకటేశ్వర్లు తెలిపారు.

భక్తుల సహకారానికి విజ్ఞప్తి

స్వామివారి పూజా కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణకు భక్తులు తమకు తోచిన విధంగా వస్తు రూపంలో లేదా నగదు రూపంలో సహకరించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. విరాళాలు అందించదలచిన వారు 897833567 నంబర్‌కు ఫోన్‌పే ద్వారా కూడా పంపవచ్చని తెలిపారు.

అయ్యప్ప స్వామి శరణుఘోషతో, భక్తి పారవశ్యంతో జరిగే ఈ 49వ అంబళం పూజ మహోత్సవంలో అయ్యప్ప భక్తులు, పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.

స్వామియే శరణం అయ్యప్ప!

ఇదీ చదవండి :: విధేయతకే సర్పంచి పీఠం..!

పొదలకూరులో అయ్యప్ప నామస్మరణతో మార్మోగనున్న ఆధ్యాత్మిక సందడి.

spiritual commotionremembrancenameAyyappaPodalakur

About the author

D

D BHASKAR

Reporter

Podalakur, Nellore

46 Posts

Latest News