17/11/2026, Tuesday · 09:30:07 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

రాష్ట్రస్థాయి క్రీడల్లో బ్లూమూన్ విద్యార్థుల సత్తా!

chalapathi 16/11/2026 6:34 PM శ్రీ సత్యసాయి 7

రాష్ట్రస్థాయి క్రీడల్లో బ్లూమూన్ విద్యార్థుల సత్తా!
Want this news as a newspaper clip?Print News Clip
  • కబడ్డీలో ప్రథమ స్థానం.. ఫుట్‌బాల్‌లో ద్వితీయ స్థానం
  • ఎనిమిది మందికి జాతీయస్థాయి పోటీలకు అవకాశం

కదిరి, నవంబర్ 16 (అమరావతి వెలుగు) రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో బ్లూమూన్ డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. కబడ్డీ విభాగంలో ప్రథమ స్థానం, ఫుట్‌బాల్‌లో ద్వితీయ స్థానాన్ని సాధించి సత్తా చాటారు.

కౌన్సిల్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి ఆంధ్రప్రదేశ్ అండర్‌-25 అంతర్‌జిల్లాల బాలబాలికల కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు కాకినాడ జిల్లా యానాంలోని వైఎస్సార్ ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో జరిగాయి. వీటిలో బ్లూమూన్ కళాశాల విద్యార్థులు కబడ్డీ, ఫుట్‌బాల్ విభాగాల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు.

కబడ్డీలో అత్యుత్తమ ప్రదర్శనతో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా.. ఫుట్‌బాల్‌లో రెండో స్థానంలో నిలిచారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పవన్‌కుమార్‌రెడ్డి, రియాజ్, గణేష్, యశ్వంత్, వెంకటచలపతి, మీర్‌ షఫీ, భానుప్రకాష్, నూర్‌ అబ్జల్‌ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా విద్యాసంస్థల అధినేత ఎం.శివశంకర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంతోపాటు, ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ఆర్‌.వెంకటరెడ్డి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం అభినందనీయమన్నారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.మనోహర్‌రెడ్డి విజేతలకు ప్రశంసాపత్రాలు, పతకాలు అందజేశారు.

వ్యాయామ ఉపాధ్యాయులు సి.విజయ్‌కుమార్, జి.రామాంజులరెడ్డి, డేనియల్, కుమార్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: విధేయతకే సర్పంచి పీఠం..!

students prowessBlueMoonstatelevelsports

About the author

C

chalapathi

Staff Reporter

12 Posts

Latest News