17/11/2026, Tuesday · 09:38:17 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

గ్రామ సర్పంచ్ పంచాయతీ ఎన్నికల్లో ప్రజా సేవే లక్ష్యంగా ముందడుగు!

THAYANNA 13/11/2026 11:26 PM కర్నూలు 16

గ్రామ సర్పంచ్ పంచాయతీ ఎన్నికల్లో ప్రజా సేవే లక్ష్యంగా ముందడుగు!
Want this news as a newspaper clip?Print News Clip

వైఎస్సార్‌సీపీ బలపరుస్తున్న గౌరవనీయులు మంత్రాలయం శాసనసభ్యులు వై. బాలనాగిరెడ్డి గారు దేశాయి కుటుంబ సభ్యుల సహకారం, ఆశీస్సులతో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న, శ్రీమతి మటపతి శివమ్మ గారికి. గ్రామ ప్రజలందరూ తమ అమూల్యమైన మద్దతు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.

మన గ్రామ అభివృద్ధి కోసం మా సంకల్పం

గ్రామంలోని ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే మా ప్రధాన లక్ష్యం.

మా అభివృద్ధి ప్రణాళికలు:

1. గ్రామంలోని ప్రతి వీధికి మెరుగైన రహదారుల నిర్మాణానికి కృషి.

2. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు.

3. మురుగు కాలువల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత.

4. ప్రతి వీధిలో వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ.

5. గ్రామంలోని పాఠశాలలు, అంగన్‌వాడీల అభివృద్ధికి కృషి.

6. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సహకారం.

7. రైతులు, మహిళలు, యువత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ.

8. గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలకు అండగా నిలవడం.

9. గ్రామ పంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకతకు ప్రాధాన్యత.

10. గ్రామసభల ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని అభివృద్ధి పనులకు ప్రాధాన్యత.

 మా మాట… ప్రజలకు ఇచ్చే భరోసా!

పదవి కోసం కాదు… ప్రజల మధ్య ఉండి సేవ చేయడం కోసం ఈ ఎన్నికల్లో ముందుకు వస్తున్నాము.

కులమతాలకు, రాజకీయ విభేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాము.

గ్రామంలో ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ, మీ కష్టసుఖాల్లో భాగస్వాములమవుతాము.

మన గ్రామం అభివృద్ధి చెందాలి… మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి… మన గ్రామానికి మంచి పేరు రావాలి...  ఈ లక్ష్యంతో ముందుకు సాగుతున్న శ్రీమతి మటపతి శివమ్మ గారికి మీ అమూల్యమైన ఓటు, ఆశీస్సులు, సహకారం అందించాలని  కోరుతున్నాము. మీ గడపకు వస్తున్నాం…

మీ ఆశీర్వాదం కోరుతున్నాం…

మీ ఆదరణతో గ్రామ అభివృద్ధికి ముందడుగు వేస్తాం!

కౌతాళం గ్రామ సర్పంచ్. అభ్యర్థి

 మటపతి శివమ్మ గారి అభిమానులు, మద్దతుదారులు మరియు గ్రామ అభివృద్ధిని ఆకాంక్షించే శ్రేయోభిలాషులు...

ఇదీ చదవండి :: విధేయతకే సర్పంచి పీఠం..!

Panchayat electionsstepforwardgoalpublicserviceGramSarpanch

About the author

Latest News