17/11/2026, Tuesday · 10:18:18 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

సోమిరెడ్డిని కలిసిన బిరదవోలు ఎంపీటీసీ సుమలత.

D BHASKAR 09/11/2026 3:25 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 22

సోమిరెడ్డిని కలిసిన బిరదవోలు ఎంపీటీసీ సుమలత.
Want this news as a newspaper clip?Print News Clip
  • ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆశీస్సులతో ప్రజలకు మరింత చేరువగా పనిచేస్తా.
  • విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా.
  • అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతా..

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు: పొదలకూరు మండల పరిషత్ ఎన్నికల్లో *బిరదవోలు ఎంపీటీసీగా విజయం సాధించిన అన్నలూరు సుమలత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.* సెగ్మెంట్ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఎమ్మెల్యేను కలిసి తనను విజయ పదంలో నడిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.🙏

ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ.. *తనపై నమ్మకం ఉంచి బిరదవోలు ఎంపీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించి, పార్టీ బి-ఫారం అందించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.* తన గెలుపు కోసం కృషి చేసిన మండల పార్టీ నాయకత్వానికి, సెగ్మెంట్ పరిధిలోని ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, అభిమానికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.

ఎమ్మెల్యే సోమిరెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ప్రథమ కర్తవ్యమని సుమలత పేర్కొన్నారు. ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. బిరదవోలు సెగ్మెంట్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపుతానన్నారు.

అభివృద్ధి,సంక్షేమంలోభాగస్వామినవుతా.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని, గ్రామంలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని సుమలత తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు.

తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆశీస్సులు, పెద్దల మార్గదర్శకత్వం, నాయకులు–కార్యకర్తల సహకారం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు. తనను గెలిపించిన బిరదవోలు సెగ్మెంట్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతాయుతంగా పనిచేస్తానని అన్నలూరు సుమలత పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: విధేయతకే సర్పంచి పీఠం..!

సోమిరెడ్డిని కలిసిన బిరదవోలు ఎంపీటీసీ సుమలత.

met SomireddyBiradavoluMPTCSumalatha

About the author

D

D BHASKAR

Reporter

Podalakur, Nellore

46 Posts

Latest News